Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్‌బాస్‌-2'.. నాని వాయిస్‌తో మరో ప్రోమో విడుదల

  • చేపలు చూపిస్తూ నాని డైలాగులు 
  • ఈ ప్రపంచంలో ఒక్కొక్కరూ ఒక్కో రకం అంటోన్న నాని
  • ఎవరేం కావాలో డిసైడ్ చేసిది ‘బిగ్‌బాస్’ అంటూ ప్రోమో
'జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2' అంటూ తెలుగు బిగ్‌బాస్‌-2 ప్రసారాల ప్రారంభోత్సవ తేదీని ప్రకటించిన సినీనటుడు నాని ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల నాని సమర్పణలో విభిన్న కథతో 'అ!' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో చేపకి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి నాని అలరించాడు.

అటువంటి కాన్సెప్ట్‌తోనే బిగ్‌బాస్‌-2కి సంబంధించిన మరో ప్రోమో ఈరోజు విడుదలైంది. ఇందులో ఏక్వేరియంలోని కొన్ని చేపలను చూపిస్తూ నాని పలు డైలాగులు వదిలాడు. 'ఈ ప్రపంచంలో ఒక్కొక్కక్కరూ ఒక్కో రకం... స్నేహితులు, ప్రేమికులు... నవ్వించే వాళ్లు, కవ్వించే వాళ్లు... మిలమిలా మెరిసే వాళ్లు..' అంటూ ఎవరికేమి కావాలో.. ఎవరేం కావాలో డిసైడ్ చేసిది ‘బిగ్‌బాస్’ అని పేర్కొన్నాడు. చివరకు ఈనెల 10 నుంచి ఈ షో ప్రసారం కానుందని తెలిపాడు.                                                
nani
bigboss

More Telugu News